Pages

Saturday, August 21, 2010

శ్లోకం - 23

కస్త్వం కోఅహం కుత ఆయాతః
కా మే జననీ కో మే తాతః|
ఇతి పరిభావయ సర్వమసారం
విశ్వం త్యక్త్వా స్వప్న విచారం||

శ్లోకం అర్ధం : సర్వవ్యాపకుడైన భగవంతుడు నీయందును, నాయందును కూడా ఉన్నాడు, అతడొక్కడే. సహనము కోల్పోయి, నిష్కారణముగా నాపై కోపముతో ఉన్నావు. నీవు శ్రీఘ్రముగా విష్ణువులో ఐక్యమును సాధింపగోరుదువేని, భేదబుద్ధిని వీడి, అంతటను సమచిత్తుడవై ఉండి గోవిందునే సేవింపుము.

తాత్పర్యము : ప్రతి ఒక్కరు తమ తమ మనసులలో ఈ విధముగా ప్రశ్నించు కోవలెను. నేను ఎవడను?, ఎక్కడ నుంచి వచ్చినవాడను? ఈ జగములో నేను ఏమి చేయుచున్నాను? నాకు తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు, శత్రువులు, మిత్రులు, సేవకులు, గురువులు ఈ విధమైన పలు సంబంధములతో నాతో ఉన్న వీరందరూ ఎవరు? వారితో నా ఆత్మకు సంబంధమేమి? ఆ బంధము ఎంత పురాతనమైనది? ఎంత కాలము నుంచి కలదు? ఇంకెంత కాలము ఉండును? ఈ తనువు తదనంతరము ఇంకను అట్టి బంధము ఉండునా? లేకున్న వారేమగుదురు? నేనేమగుదును? ఈ దేహము ఎచ్చట నుండి వచ్చినది? తిరిగి ఎచ్చటకు పోవును? నాయొక్క నిజస్వరూపమేది? ఈ విధముగా సంసారమును గూర్చి విచారించవలెను. అప్పుడు మన ప్రశ్నలకు మనకే సమాధానము దొరుకును. ఆ సమాధానములతో ఆత్మతత్వము అవగతమగును. సంసారము ఒక కల వలె తోచును. మన బంధములన్ని ఒక మిధ్య అని జీవన్నాటకములో మనము ధరించిన పాత్రలని అర్ధమగును. దాని వలన మనసులో అలిమిన మోహము నశించి, మమకారము, వ్యామోహము, వస్తు ప్రపంచముపై ఆశా పాశములు నశించి ప్రశాంత చిత్తము కలుగును. దాని మూలముగా బంధ విముక్తులమై పరమానందము బడయగలము.

No comments:

Post a Comment