Pages

Saturday, August 21, 2010

శ్లోకం - 31

గురుచరణాంబుజ నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః|
సేంద్రియమానస నియమాదేవ
ద్రక్ష్యపి నిజ హృదయస్థం దేవం||

శ్లోకం అర్ధం : అష్టసాధనలు అవలంబించు, అంతర్ముఖముగ మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతమునొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతము అగును.

తాత్పర్యము : మానవుడు తెలివిగా నిత్య, అనిత్య వస్తువులేవియో, ఏమి పొందవలెనో, ఏమి విడువవలెనో వివేకముతో తెలుసుకొనవలెను. అష్టాంగ మార్గమును అవలంబించవలెను. ఆత్మ సాక్షాత్కారము బడయుటకు ఎనిమిది సాధనలు కలవు. అవి - యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహర, ధారణ, ధ్యాస, సమాధులు. ఈ విధముగా చివరి స్థితికి చేరిన జీవికి నిర్వికల్ప ఆత్మానుభవము కలిగి, పరమ ఆనందము, శాంతి, సుఖము లభించి ఆత్మ పరమాత్మలో ఐక్యము అగును. 


2 comments:

  1. నమస్కారం అండి
    భజగోవిందం శ్లోకం అర్ధం తెల్సుకోవడానికి చాల సైట్స్ వెతకను. నాకు కనిపించలేదు.
    మీవల్ల నేను తెలుసుకోగలిగాను.

    ReplyDelete