గురుచరణాంబుజ నిర్భర భక్తః
సంసారాదచిరాద్భవ ముక్తః|
సేంద్రియమానస నియమాదేవ
ద్రక్ష్యపి నిజ హృదయస్థం దేవం||
శ్లోకం అర్ధం : అష్టసాధనలు అవలంబించు, అంతర్ముఖముగ మనసును నిలుపు, ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతమునొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతము అగును.
తాత్పర్యము : మానవుడు తెలివిగా నిత్య, అనిత్య వస్తువులేవియో, ఏమి పొందవలెనో, ఏమి విడువవలెనో వివేకముతో తెలుసుకొనవలెను. అష్టాంగ మార్గమును అవలంబించవలెను. ఆత్మ సాక్షాత్కారము బడయుటకు ఎనిమిది సాధనలు కలవు. అవి - యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహర, ధారణ, ధ్యాస, సమాధులు. ఈ విధముగా చివరి స్థితికి చేరిన జీవికి నిర్వికల్ప ఆత్మానుభవము కలిగి, పరమ ఆనందము, శాంతి, సుఖము లభించి ఆత్మ పరమాత్మలో ఐక్యము అగును.
నమస్కారం అండి
ReplyDeleteభజగోవిందం శ్లోకం అర్ధం తెల్సుకోవడానికి చాల సైట్స్ వెతకను. నాకు కనిపించలేదు.
మీవల్ల నేను తెలుసుకోగలిగాను.
i am very happy to see these
ReplyDelete