Pages

Saturday, August 21, 2010

శ్లోకం - 30

ప్రాణాయామం ప్రత్యాహారం
నిత్యానిత్య వివేకవిచారం|
జాప్యసమేత సమాధివిధాన
కుర్వవధానం మహదవధానం||

శ్లోకం అర్ధం : సద్గురువులను ఆశ్రయించుము, వారి కరుణతో విబుధుడవగుము. ఇంద్రియములపై నిగ్రహమును ఉంచి మనసును గురు చరణములపై ఉంచి, భవ బంధములు త్యాగము చేసి ఆ హరిని గాంచు.

తాత్పర్యము : ప్రపంచమునందు ఎన్నో తెలియని విషయములు ఉండును. వాటిని తెలుసుకొనుటకు మానవునకు ఒక జీవితము చాలదు. అందులోనూ ఆధ్యాత్మిక విషయములు గురు ముఖముగా విన్నగాని అవగతము కావు. కావున, సత్ గురువును ఆశ్రయించి, మనసును గురు పాద పద్మములపై లగ్నము చేసి, అత్యంత గౌరవము, భక్తితో సేవించిన గురు కృపకు ప్రాప్తుడై, అచిరకాలములో అజ్ఞానము వీడి, సంసార బంధముక్తుడై, సాధన మార్గమును ఎరిగి, ఇంద్రియ నిగ్రహము, మనస్సుపై జయము సంపాదించి ఆత్మసాక్షాత్కారము పొందగలడు. కనుక శ్రీఘ్రముగా పరమాత్మను చేరవలెనన్న సత్ గురువు యొక్క కృప ఎంతయో అవసరము.    

No comments:

Post a Comment