Pages

Saturday, August 21, 2010

శ్లోకం - 28

సుఖతః క్రియతే రామాభోగః
పశ్చాద్దంత శరీరే రోగః|
యద్యపి లోకే మరణం శరణం
తదపి న ముంచతి పాపాచరణం||

శ్లోకం అర్ధం : ఇంద్రియ సుఖములు ఎన్నడూ తీరవు, కామ వాంఛలే కాల సర్పములై దేహమునకు రోగము మిగుల్చును. మనిషికి చివరకు మరణము తథ్యము, కాని అతని పాపములు అతనిని వదలవు. 

తాత్పర్యము : మితిమీరిన ఇంద్రియ సుఖము, కామ వాంఛలు అనర్ధములకే దారి తీయును. వస్తు సుఖములు ఆశాశ్వితములగుటయే కాదు, వాని వలన అనేక అనర్ధములు, కష్టములు కలుగును. అజ్ఞాని అటువంటి దృశ్యపదార్దముల వెనుక పడి, అందే ఆనందము కలదని భ్రమించి, శాశ్వతమైన, పరిపూర్ణమైన, అపరిమితమైన పర సుఖములను మరచి నానా కష్టముల పాలగుచున్నాడు. మృత్యువు పచ్చగడ్డిలో పామువలె పొంచి ఉన్నది. అది ఏ క్షణములోనైనను శరీరమును కబళించును. కావున శరీర సుఖములపై మోహము వదిలి, భక్తి, జ్ఞాన, వైరాగ్య మార్గములలో సాధన చేసి, పాపమును కడగి వేసి, ఆత్మానుభూతితో జీవితము సఫలము చేసుకొనవలెను.

No comments:

Post a Comment