యావత్పవనో నివసతి దేహే
తావత్పృచ్ఛతి కుశలం గేహే|
గతవతి వాయౌ దేహాపాయే
భార్యా బిభ్యతి తస్మిన్కాయే||
శ్లోకం అర్ధం : శరీరములో ఊపిరి ఉన్నంతవరకు ఇంటిలోనివారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి, మరణము సంభవించినపుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును.
తాత్పర్యము : శరీరంలో యీహంస సాగిన వరకే బంధువులు, మిత్రులు నీ క్షేమ సమాచారములు అడుగగా వత్తురు. నీపై అతి ప్రేమ, వాత్సల్యము కురిపింతురు. అది అంతా నీ గుండెలలో ప్రాణ వాయువులు సాగు వరకే. ఒక్కసారి ఉఛ్ఛ్వాస నిశ్వాసములు ఆగి, నీవు విగత జీవుడవై నేల బడియుండ, నీ భార్య కూడా నీదరి చేరుటకు భయపడును. నీవారందరూ నీ శరీరమును తాకుటకు కూడా శంకింతురు. నీవు తనువు చాలించిన కొన్ని క్షణముల వరకే అందరూ శోకము ప్రదర్శింతురు, ఆపై నీ ఊసును కూడా ఎవ్వరూ ఎత్తరు. అందమైనదని ఊహించుకునే మన ఈ శరీరము రోగముతో, రోతతో, మలిన గంధ భూయిష్ఠమగును. శరీరమున ప్రాణ వాయువులు ఆగి పోవగానే, అది పనికిమాలినదై పోవును. ఎంత త్వరగా దానిని వదిలించుకొందామా అని అందరూ భావింతురు. పంచ భూతములతో నిర్మితమైన ఈ దేహం, చివరకు ఈ పంచ భూతములలోనే కలిసి పోవలె. అట్టి ఈ హీన శరీరం పై మమతలు ఏల?
Sunday, August 22, 2010
శ్లోకం - 7
బాలస్తావత్క్రీడాసక్తః
తరుణస్తావత్తరుణీసక్తః|
వృద్ధస్తావచ్చింతాసక్తః
పరే బ్రహ్మణి కోపిన సక్తః||
శ్లోకం అర్ధం : బాల్యమంతయు ఆటపాటలయందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్థక్యమును సంసార చింతల చేతను జీవితమంతా గడుపుదురే కాని, పరబ్రహ్మమునందు ఆసక్తి కలవారెవ్వరును లేరు.
తాత్పర్యము : బాల్యములో, తెలిసీ తెలియని వయసులో సమయమునంతా ఆట పాటలకు వ్యర్థము చేసుకోనుచున్నాము. పిమ్మట యుక్త వయస్సు రాగానే, స్త్రీ వ్యామోహములో పడి కామ-క్రీడలకు సమయము వృధా చేయుచున్నాము. ఆ పిమ్మట వృద్ధాప్యములో ధన, కాంత, కనకాల మీద ఆశ తీరక జర, వ్యాధి బాధలతో చింతాగ్రస్తులమై ఆ చివరి క్షణములు వృధా చేయుచున్నాము. ఇంక భగవంతునిపై తలపు ఎప్పుడు? జీవితకాలమంతా యిటుల వృధా అయిన సాధించినది ఏమి? కావున కర్తవ్యము నెరిగి, పరమాత్మునిపై మనస్సు నిలిపి, గోవింద స్మరణతో జీవితము పునీతము చేసుకొనుము. ఆత్మ నిగ్రహముతో, పరతత్వ జ్ఞానము బడసి, భక్తి సాధనముతో భగవంతుని చేరుము. నేడు, రేపు అని రోజులు గడుపకుము. మానవ జన్మము మహాదుర్లభము, భగవంతుని చేరుటకు సదవకాశము. ఇది చేజార్చుకొనకుము.

శ్లోకం - 8
కా తే కాంతా కస్తే పుత్రః
సంసారో యమతీవ విచిత్రః|
కస్య త్వం కః కుత ఆయాతః
తత్త్వం చింతయ తదిహ భ్రాతః||
శ్లోకం అర్ధం : ఓ సోదరా! నీ భార్య ఎవరు? ఎవడు నీ పుత్రుడు? వారికిని, నీకును గల సంబంధమేమి? నీవు ఎవరవు? ఎక్కడనుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము.
తాత్పర్యము : ఓయి సుమతీ! కొంత ఆలోచించుము. ఆత్మ స్వరూపులమైన మనమందరమూ ఈ జన్మలో అమ్మ, నాన్న, భార్య, భర్త, పుత్రుడు, కూతురు, బంధువులు అన్న బంధములతో జీవించుచున్నాము. నీవు పుట్టక ముందు నీ తల్లిదండ్రులతో ఏమి నీకు సంబంధము? అలాగే నీకు పుట్టిన బిడ్డలతో వారి జన్మకు ముందు నీకేమిటి సంబంధము? పెండ్లాడక ముందు నీ భార్య ఎవరు, నీవెవరు? ఈ భవ బంధములేవి పుట్టుక మునుపు లేవు, మరణము తరువాత ఉండవు. కనుక ఈ బంధములు శాశ్వతములు అని నమ్మి వ్యామోహములో పడి చింతనొందకుము. ఈ బ్రతుకు ఒక మాయా నాటకము, అందులో పాత్రలము మనము, నాటకము ఆడునంత వరకు మన పాత్రల బాంధవ్యములు వేరు. అదే విధముగా ఈ జీవన్నాటకము కూడా. అది నిజమని భ్రమించకుము. ఆ భ్రమలో ఉన్నంత వరకూ నా భార్యాబిడ్డలని వ్యాకుల పడుతూ, వారి కొరకు నీ సమయము వృధా చేయకుము. ఉన్నదానితో తృప్తి పడి వారిని పోషించుము, మిగిలిన సమయము భగవన్నామస్మరణలో గడుపుము.

శ్లోకం - 9
సత్సంగత్వే నిః సఙ్గత్వం
నిఃసఙ్గత్వే నిర్మోహత్వం|
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః||
శ్లోకం అర్ధం : జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగును.
తాత్పర్యము : సజ్జన సాంగత్యము వలన నీకు ప్రాపంచిక విషయముల గురించి నిజము తెలియును. దాని వలన వానిపై వ్యామోహము నశించును. దాని ఫలితముగా నీకు అజ్ఞానము అంతరించును. అజ్ఞానము అంతరించిన హృదయములో ఏకాగ్రత కలిగి, భగవంతునిపై మనసు నిలుచును. దాని ఫలితముగ నీకు ముక్తి చేకూరును. కావున సత్ సంగములకు వెళ్ళుట, సత్ పురుషులను కలయుట చాలా ముఖ్యము. సువాసన గల వనములో నడచిన, ఆ సువాసన నీకు లభించినట్లే, సాధు సాంగత్యము వలన మంచి చేకూరును. గురువులు, పెద్దలు, ప్రజ్ఞావంతులను గౌరవించుచూ, వారి సేవ చేయుచూ, వారి సాంగత్యములో మంచిని తెలుసుకొని, మాయను వీడి, భగవన్ ముఖముగా మనసు మళ్ళించి విముక్తి బడయుము.

శ్లోకం - 10
వయసి గతే కః కామవికారః
శుష్కే నీరే కః కాసారః|
క్షీణే విత్తే కః పరివారో
జ్ఞాతే తత్త్వే కః సంసారః||
శ్లోకం అర్ధం : వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది? నీరు ఎండిపోయిన యెడల అది చెరువు ఎలా అవుతుంది? అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుండును? తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును?
తాత్పర్యము : తనువులో శక్తి నశించి, నడుము వంగి, ఇంద్రియముల పటుత్వము తగ్గినపుడు కామ వికారాలు తగ్గుటలో విచిత్రమేమి? దేహ పటుత్వము నశించినపుడు, నరములలో నీరసము వచ్చినపుడు కామ క్రీడలపై ఆసక్తి నశించుట సహజము. నీరన్నియు ఎండిపోయిన పిమ్మట యిక చెరువనేది ఎక్కడ? అనగా, అశక్తుడవైనపుడు కామ క్రీడలయందు అనాసక్తుడ వగుటలో గొప్ప యేమి? వయసులో ఉన్నప్పుడు, మనో వికారములను అదుపు చేసి పరమాత్మునిపై లగ్నము చేసినవాడు గొప్పవాడు. అనగా, ఎప్పుడో వృద్ధాప్యములో అన్ని అంగములు ఊడినపుడు, వాటిపై అయిష్టత గలిగినను, మనసు మాత్రము ఇంకా వాటి వెనుకే పరుగులిడుచుండును. వయసులో ఉన్నప్పుడే ఆత్మ నిగ్రహము పొందిన, శరీరము మనసు స్వాధీనములో ఉండి, ఏకాగ్రత చేకూరును. కావున భగవత్ చింతన పిన్న వయసు నుండే ప్రారంభించవలెను.

Subscribe to:
Posts (Atom)